తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-18T22:43:33+05:30 IST

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే రాష్ట్ర ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలు ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఎండల కారణంగా ఉదయం 9 గంటలకు ప్రారంభించి త్వరగా ముగించాలని  కేసీఆర్‌ సూచించారు. జూన్‌ 2 సాయంత్రం రవీంద్రభారతి, జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనం ఏర్పాటు చేయాలని, కవులు, రచయితలను ఆహ్వానించాలని కేసీఆర్ సూచించారు. 

Updated Date - 2022-05-18T22:43:33+05:30 IST