కుమ్రం భీమ్‌ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం: కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-10-23T01:27:24+05:30 IST

అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కుమ్రం భీమ్‌ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని ‘ మా గూడెం, మా తండా, మా రాజ్యం’ అనే ఆదివాసీల తర తరలా ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని ముఖ్యమంత్రి

కుమ్రం భీమ్‌ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కుమ్రం భీమ్‌ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని ‘ మా గూడెం, మా తండా, మా రాజ్యం’ అనే ఆదివాసీల తర తరలా ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీమ్‌ జయంతిసందర్భంగా సీఎం కేసీఆర్‌ కొమ్రం భీమ్‌సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని కేసీఆర్‌ తెలిపారు. కొమ్రం భీమ్‌జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. అమరుడు కొమ్రం భీమ్‌ పోరాట ప్రదేశం జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి పరిచామన్నారు. 


కొమ్రం భీమ్‌ స్మారక చిహ్నం, స్మృతివనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీమ్‌ పోరాట పటిమను భవిష్యత్‌ తరాలకు తెలియపరిచే విధంగా మౌలిక వసతులను జోడేఘాట్‌లో ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఆదివాసీ భవన్‌ నిర్మాణం చేపట్టినామని తెలిపారు. అది ప్రారంభోత్సవానికి సిద్ధమైందన్నారు. ‘జల్‌ జంగల్‌ జమీన్‌’ అనే కొమ్రం భీమ్‌ నినాదంలోని స్పూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధాన ఉద్యమంలోనూ, స్వరాష్ట్ర అభివృద్ధి పధంలోనూ ఇమిడి ఉన్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అడవులు, ప్రకృతి పట్ల ఆదివాసీ బిడ్డలకు వుండే ప్రేమ గొప్పదని, వారిస్పూర్తిని ప్రతి ఒక్కరూ కలిగి వుండాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-23T01:27:24+05:30 IST