విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-08-10T06:10:16+05:30 IST

విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్ర త్యేక దృష్టి సారించారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి
మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్ర త్యేక దృష్టి సారించారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎల్‌జీ గార్డెన్స్‌లో పీఆర్‌టీయూ ఆద్వర్యంలో జరిగిన జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో 2022 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూ ర్తి చేసి అత్యుత్తమ ప్రతిభతో 10 జీపీఏ సాధించిన 48 మంది విద్యార్థినీ విద్యార్థులను, వంద శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్ర మా నికి మంత్రి హాజరయ్యారు. పలువురు విద్యార్థులు, ప్రధానో పాధ్యాయు లను సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. గ్రామాలలో ని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడానికి సీఎం కేసీఆర్‌ రూ. 7,230 కోట్ల నిధులతో మూడు దశలలో మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. పెద్దపల్లి ఎంపీ బొర్ల కుంట వెం కటేశ్‌ నేత మాట్లాడుతూ సమాజంలో అవసరమైన మార్పులు తీసుకొని రావడానికి విద్య పదునైనా ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి ఒక అద్బుత పథకమని అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తూ పాఠశాలల అభివృద్ధికి పథకం పాటుపడుతుందన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, వంద శాతం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకు పీఆర్‌టీయూ సన్మానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి, పీ ఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యద ర్శలు యాళ్ల అ మర్‌నాథ్‌ రెడ్డి, బోయినిపల్లి ఆనంద్‌రావు, డీసీఎంఎస్‌ చై ర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, వివిధ మండలాల విద్యాధికారులు, పాఠశాలల ఉ పాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:10:16+05:30 IST