Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య భౌతికకాయానికి CM KCR నివాళి

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కొద్దిసేపటి క్రితమే అమీర్‌పేట్‌లోని రోశయ్య సీఎం చేరుకున్నారు. రోశయ్య పార్థివదేహానికి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళి అర్పించారు. అనంతరం రోశయ్య కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ సానుభూతిని తెలియజేశారు.


మరోవైపు రేపు(ఆదివారం) కార్యకర్తల సందర్శనార్థం  రోశయ్య పార్థివదేహాన్ని గాంధీభవన్‌కు తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభంకానుంది. కొంపల్లిలోని ఫాంహౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో మాజీ సీఎం అంత్యక్రియలు జరుగనున్నాయి. మూడురోజుల పాటు సంతాప దినాలుగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. 

Advertisement
Advertisement