తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాడాలి: కేసీఆర్

ABN , First Publish Date - 2021-11-29T00:53:40+05:30 IST

తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు వెనకాడవద్దని, మన ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో గొంతు వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు ఆదేశించారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాడాలి: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు వెనకాడవద్దని, మన ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో గొంతు వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు ఆదేశించారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపద్యంలో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 


ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టం కోసం పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడాలని సీఎం ఆదేశించారు. రాష్టం విడిపోయిన తర్వాత తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదన్నారు. క్రిష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం కూడా పార్లమెంట్ లో పట్టుబట్టాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాల కోసం కూడా ఎంపీలు ప్రశ్నల వర్షం కురిపించాలన్నారు. 

Updated Date - 2021-11-29T00:53:40+05:30 IST