యాసంగిలో పంటల సాగుపై రేపు సీఎం కేసీఆర్‌ సమావేశం

ABN , First Publish Date - 2020-10-09T20:30:08+05:30 IST

యాసంగిలో అమలుచేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ప్రగతి భవన్‌లో వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

యాసంగిలో పంటల సాగుపై రేపు సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: యాసంగిలో అమలుచేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ప్రగతి భవన్‌లో వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. ‘. కేంద్ర ప్రభుత్వం పెద్దయెత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నది. దీని వల్ల దేవంలో మక్కల కొనుగోలు పై ప్రభావం చూపనుంది.


ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవల్సి వుంది. శనివారం సమావేశంలో ఈ విషయం పై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. కరోనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమ్రంతి ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.


కరోనా నేపధ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించారు. ఇంకా కరోనా ముప్పు తొలగిపోలేదు. అందుకే వర్షాకాలం పంటలను కూడా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోలు చేయాలి. 6వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి.


ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. పంటలు కొనుగోలుచేసిన తర్వాత వీలయినంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-10-09T20:30:08+05:30 IST