రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానం- సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-06-04T00:32:33+05:30 IST

మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయశాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానం- సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయశాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈసారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇంది ప్రతి ఏటా ప్రతి పీజన్‌లో కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండిండం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు. 


అంతిమంగా రైతులాభం  కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. దేశంలో , రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినప్పటికీ పోషకాహార భద్రత సాధించలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప బలవర్ధకమైన ఆహారం తినడం లేదని అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అఆంటి పంటలు పండించాలని సీఎం చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు రోగ నిరోదక శక్తి పెరగాలని సీఎం ఆకాంక్షించారు. 


రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు పద్దతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లారాజేశ్వరరెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్ధన్‌రెడ్డి,వ్యవసాయ యూనివర్శిటీ విసి ప్రవీణ్‌రావు , ఆగ్రో బిజినెస్‌ కన్సల్టెంట్‌ గోపీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T00:32:33+05:30 IST