రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం KCR

ABN , First Publish Date - 2022-06-28T15:23:26+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం రాజ్‌భవన్ చేరుకున్నారు.

రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం KCR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మంగళవారం ఉదయం రాజ్‌భవన్ చేరుకున్నారు. సరిగ్గా తొమ్మిది నెలల కిందట రాజ్‌భవన్ వచ్చిన సీఎం... తిరిగి 9 నెలల తర్వాత ఈరోజు రాజ్‌భవన్‌కు వచ్చారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ (Ujjal Bhuyan) ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10:05 గంటలకు  రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ తమిళిసై(Tamilisai) ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చారు. మీడియాకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి లోనికి వెళ్లారు. దాదాపు ఏడాది తరువాత రాజ్‌భవన్‌లో నేరుగా గవర్నర్‌ను కేసీఆర్ కలవనున్నారు.


రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు అనంతరం ఐదవ ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. 

Updated Date - 2022-06-28T15:23:26+05:30 IST