TS News: దేశంలో ద్వేషం, అసహనం పెరిగాయి: కేసీఆర్

ABN , First Publish Date - 2022-08-06T22:39:05+05:30 IST

దేశంలో ద్వేషం, అసహనం పెరిగాయని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

TS News: దేశంలో ద్వేషం, అసహనం పెరిగాయి: కేసీఆర్

హైదరాబాద్: దేశంలో ద్వేషం, అసహనం పెరిగాయని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. నీతిఆయోగ్‌ (NITI Aayog)లో నీతి అలా ఉందని విమర్శించారు. నీతి ఆయోగ్‌ నిరర్ధక సంస్థగా మారిందని దుయ్యబట్టారు. మేథోమథనాన్ని ఆపేసి.. భజన బృందంగా మారిందని తప్పుబట్టారు. 8 ఏళ్లలో నీతి ఆయోగ్‌ సాధించిందేమీ లేదని విమర్శించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) చేసిన ఏ వాగ్దానం నెరవేరడం లేదన్నారు. ఉపాధి హామీ కూలీలు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని తెలిపారు. రూపాయి విలువ పాతాళంలోకి పడిపోతోందని, దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతోందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతాంగం దెబ్బతిందని మండిపడ్డారు. దేశం అన్నిరంగాల్లోనూ నాశనమైందన్నారు. రాష్ట్రాల ప్రగతిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. మూర్ఖులు తాము కూర్చున్న కొమ్మలను తామే నరుక్కుంటారని, కేంద్రం వైఖరి కూడా ఇదే విధంగా ఉందని కేసీఆర్ ధ్వజమెత్తారు.

Updated Date - 2022-08-06T22:39:05+05:30 IST