వనపర్తి: ‘మన ఊరు-మన బడి’ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-08T21:27:18+05:30 IST

వనపర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు.

వనపర్తి: ‘మన ఊరు-మన బడి’ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

వనపర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు. వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ విద్యారంగాన్ని పటిష్టం చేసే కార్యక్రమానికి వనపర్తి వేదికగా శ్రీకారం చుట్టామన్నారు. సర్కార్‌ బడుల్లో అన్ని వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేవన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉందన్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు.


కాగా వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్‌ మంగళవారం పర్యటన నేపథ్యంలో వనపర్తి పట్టణం గులాబీమయమైంది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మొదటిసారి జిల్లాలోకు రావడంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జిల్లాకు భారీగా నిధులు ఇస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. 

Updated Date - 2022-03-08T21:27:18+05:30 IST