హైదరాబాద్: కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగ రాష్ట్రానికి సంబంధించి తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, తదితర అంశాలను సీఎం కేసీఆర్ చర్చించారు. సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.