Abn logo
Jul 27 2021 @ 23:05PM

సీఎం కేసీఆర్‌ది ఎలక్షన్‌ డ్రామానే!

మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ రైతు మోర్చా ఆధ్వర్యంలో మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో

మెదక్‌ రూరల్‌, జూలై 27: ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రైతాంగానికి చేసిన మేలు ఏమిలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర రైతు మోర్చా పిలుపు మేరకు  మంగళవారం మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు ఆందోళన నిర్వహించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ ఆందోళనలో కిసాన్‌ మెర్చా జిల్లా  అధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌, సురేష్‌, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, శివ, ఎక్కలదేవి మధు పాల్గొన్నారు.