CM KCR కు అస్వస్థత..

ABN , First Publish Date - 2022-03-11T17:21:56+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్వస్థతకు గురయ్యారు.

CM KCR కు అస్వస్థత..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం కేసీఆర్.. ఆస్పత్రికి వెళ్లారు. సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. సీఎంకు వైద్యులు.. యాంజియోగ్రామ్, సిటీస్కాన్ పరీక్షలు చేస్తున్నారు. అస్వస్థత కారణంగా కేసీఆర్ యాదాద్రి పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. కాగా.. రెండ్రోజులుగా ముఖ్యమంత్రి చాలా నీరసంగా ఉన్నారని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఎడమ చెయ్యి లాగుతోందని కేసీఆర్ చెప్పారని.. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-03-11T17:21:56+05:30 IST