Heavy Rains: భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

ABN , First Publish Date - 2022-07-23T21:44:04+05:30 IST

భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల మంత్రులకు సీఎం కేసీఆర్

Heavy Rains: భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

హైదరాబాద్: భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల మంత్రులకు సీఎం కేసీఆర్ (CM Kcr) ఫోన్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు (Hyd Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తాజాగా తెలిపింది. సుమారు 7-10 సెం.మీ. వర్షపాతం (Rainfall) నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలోని (Telangana) ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కొమురంభీం, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో (Karimnagar District) 15-20 సెం.మీ. వర్షం పడే అవకాశం ఉందని.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈనెల 8 నుంచి 16 దాకా గ్రేటర్‌ వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. 

Updated Date - 2022-07-23T21:44:04+05:30 IST