హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి అందరికీ సంతోషం, ఆరోగ్యాన్ని తీసుకురావాలని గవర్నర్ తెలిపారు. మకర సంక్రాంతికి సంస్కృతి పరంగా గొప్ప ప్రాముఖ్యత ఉందన్నారు. అన్నివర్గాలను సంక్రాంతి వేడుకలు దగ్గర చేస్తాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్...
మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించే పుణ్యకాలం ఉత్తరాయణమని సీఎం అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రజలు సిరిసింపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ప్రజలు పచ్చదనం మధ్య పండుగ జరుపుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి