టీచర్లే లేరు.. ఇంగ్లిష్‌ ఎలా? ముందు ఖాళీలను నింపండి..

ABN , First Publish Date - 2022-01-19T16:44:35+05:30 IST

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం పేరుతో సీఎం కేసీఆర్‌ ప్రజల్ని మరోమారు తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు

టీచర్లే లేరు.. ఇంగ్లిష్‌ ఎలా? ముందు ఖాళీలను నింపండి..

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం పేరుతో సీఎం కేసీఆర్‌ ప్రజల్ని మరోమారు తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇంతవరకూ నోటిఫికేషన్‌ జారీ చేయలేదని, ఉపాధ్యాయుల నియామకం జరగకుండా విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యను ఎలా అందిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్క టీచర్‌ పోస్టును కూడా భర్తీ చేయని సీఎం కేసీఆర్‌ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో రేవంత్‌ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని తెలంగాణలో అమలు చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం మేరకు సీట్లు పేద విద్యార్థులకు దక్కుతాయని పేర్కొన్నారు. కానీ.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ఇప్పటికే అందిస్తున్నామన్న పేరుతో విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో కేసీఆర్‌ అమలు చేయట్లేదని ఆరోపించారు.

కొవిడ్‌తో ముందస్తు జాగ్రత్త కోసం విద్యాసంస్థలను మూసేసిన కేసీఆర్‌.. బార్‌లు, పబ్‌ల మూసివేత విషయంలో అదే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పబ్బులు, బార్లల్లో కొవిడ్‌ మరణాలు చోటు చేసుకుంటున్నా ఆదాయం కోసమే వాటిని నియంత్రించడం లేదని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసీఆర్‌, విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదని, అందుకే కొవిడ్‌పై ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనలేదని విమర్శించారు. దళితబంధు పథకం నిజాయితీగా అమలు చేస్తే బాగుంటుందని,  హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత ఈ పథకం గురించి కేసీఆర్‌ మాట్లాడటం లేదన్నారు. 

Updated Date - 2022-01-19T16:44:35+05:30 IST