సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి

ABN , First Publish Date - 2020-07-10T10:11:56+05:30 IST

సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతి అని విద్యాశాఖమంత్రి పి.సబితారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్‌ జిల్లా పరిధిలో

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


పరిగి రూరల్‌ / కులకచర్ల /దోమ / పూడూరు : సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతి అని విద్యాశాఖమంత్రి పి.సబితారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్‌ జిల్లా పరిధిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పరిగి మండలం రంగాపూర్‌, దోమ మండలకేంద్రం, కులకచర్ల, పూడూర్‌ మండలం చన్‌గొముల్‌ గ్రామంలో ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డితో కలిసి రైతువేదిక భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కులకచర్లలో డీసీసీబీ ఏటీఎంను ప్రారంభించారు. అదేవిధంగా పరిగి, పూడూరులో హరితహారం మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా పూడూరు మండల కాంగ్రెస్‌ నాయకులు డిగ్రీ, పీజీ ఫైనలియర్‌ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్‌ పనులను ప్రారంభించాలని మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి మాట్లాడారు. రైతుల కోసం కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రైతువేదికల భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు.


ప్రతి క్లస్టర్‌లో రూ.22 లక్షలతో ఓ రైతువేదిక నిర్మించబోతున్నామన్నారు. రెండు నెలల్లో వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి, ఎంపీపీ అరవింద్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ క్రిష్ణారెడ్డి, డీఏఓ గోపాల్‌, జడ్పీటీసీ సభ్యులు హరిప్రియారెడ్డి, కె.నాగిరెడ్డి,  రాందా్‌సనాయక్‌, మేఘమాల ప్రభాకర్‌గుప్త, ఎంపీపీలు అనసూయ, సత్యహరిశ్చంద్ర, మల్లేశం, పరిగి మార్కెట్‌ చైర్మన్‌ అజార్‌, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-10T10:11:56+05:30 IST