తెలంగాణ అమరుల కుటుంబాలను పట్టించుకోని సీఎం కేసీఆర్‌: షర్మిల

ABN , First Publish Date - 2022-08-16T09:32:34+05:30 IST

తెలంగాణ అమరుల కుటుంబాలను, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోకపోవడం అమానుషమని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

తెలంగాణ అమరుల కుటుంబాలను పట్టించుకోని సీఎం కేసీఆర్‌: షర్మిల

నారాయణపేట టౌన్‌, ఆగస్టు 15: తెలంగాణ అమరుల కుటుంబాలను, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోకపోవడం అమానుషమని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. సోమవారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి పాదయాత్రగా వచ్చి సత్యనారాయణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరగగా.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమంలో పాల్గొన్న వారికి న్యాయం చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు..  వైఎ్‌సఆర్‌టీపీకి అధికారమిస్తే ఉద్యమకారులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశంలో మహిళలకు సమానత్వం లేదని, ఇంకా చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. మరియమ్మ అనే మహిళను జైలులో పెట్టి చంపేశారని.. మహిళలకు ఈ స్వతంత్ర దేశంలో గౌరవం లేకుండా పోయిందన్నారు. మీరు ఆశీర్వదిస్తే వైఎ్‌సఆర్‌ సుపరిపాలనను ప్రజల చేతుల్లో  పెడతామని షర్మిల హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-08-16T09:32:34+05:30 IST