ప్రజలను మోసగిస్తున్న సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-24T05:21:31+05:30 IST

: పాలమూరు ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.

ప్రజలను మోసగిస్తున్న సీఎం కేసీఆర్‌
మొక్క నాటి నీరు పోస్తున్న డీకే అరుణ, ఎర్ర శేఖర్‌ తదితరులు

- మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ 

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మొక్కలు నాటిన నాయకులు


జడ్చర్ల, జూన్‌ 23 : పాలమూరు ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే  అరుణ ఆరోపించారు. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధం తి సందర్భంగా మండలంలోని మాచారం, జడ్చర్ల మునిసిపాలిటీలోని 10వ, 3వ, 16వ వార్డులలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె విలేకరు లతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో, సెంటిమెంట్‌తో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్ట్‌లపై ముఖ్యమంత్రికి చీమంత పట్టడంలేదని ఆరోపించారు. ఆర్డీఎస్‌ నీళ్లను కుడికాలువ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తవ్వుకునిపోతుంటే, తరలింపును అడ్డుకునే శక్తిలేక ముఖ్యమంత్రి చేతులెత్తేసారని విమర్శించారు. ప్ర శ్నిస్తే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏపీ ముఖ్యమంత్రితో లోలోపల తెలంగాణ ముఖ్యమం త్రి ఏకమయ్యారని ఆరోపించారు. ‘పాలమూరు యేట్ల పోయినా, తుంగభద్ర, కృష్ణలు కొట్టుకుపోని, నేను మాత్రం బాగుంటే చాలన్న’ ధోరణిలో కేసీఆర్‌ ఉన్నారని విమర్శించారు. పాలమూరు జిల్లా ప్రజలను మోసం చేయడం మానుకుని, ఆర్టీఎస్‌ కుడికాలువ వద్దకుఅర్జెంట్‌గా వెళ్లి,కాలువలో అడ్డం పడి, తరలించుకుపోతున్న నీళ్లను ఆపాలంటూ హితవు పలికారు. కొవిడ్‌ నిబంధనలు పాటించక పోతే థర్డ్‌వేవ్‌ను తట్టుకోలేమన్నారు. ప్రజల్లో చై తన్యం తెచ్చేవిధంగా ముఖ్యమంత్రి ఎలాంటి చర్య లు తీసుకోవడంలేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రైవేట్‌ విద్యాలయాలతో కుమ్మక్కై పాఠశాలలను తెరిపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులతో ఫీజు లు కట్టించుకున్న తర్వాత థర్డ్‌వేవ్‌ పేరుతో పాఠ శాలలు మూయిస్తాడంటూ విమర్శించారు.


మొక్కలు నాటిన అరుణ


శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జడ్చర్ల మండలం మాచారం, జడ్చర్ల మునిసిపాలి టీలోని 10వ, 3వ, 16వ వార్డులలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటారు. 


వ్యాక్సినేషన్‌ పరిశీలన 


జడ్చర్ల అర్బన్‌హెల్త్‌సెంటర్‌లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సం దర్భంగా ప్రతి రోజు ఎంత మందికి వ్యాక్సిన్‌ వేస్తు న్నారని, ఫస్ట్‌ డోస్‌, సెకండ్‌ డోస్‌ ఎంత మందికి వేస్తున్నారంటూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌, కౌన్సిలర్‌ కుమ్మరి రాజు, నాయకులు రాపోతుల శ్రీనివాస్‌ గౌడ్‌, వెంకట్‌రాంరెడ్డి, సాహితిరెడ్డి, నాగరాజు, మధు, రేలింగ్‌నాగరాజు, నాగార్జున, అనంతకిషన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T05:21:31+05:30 IST