Abn logo
May 15 2021 @ 20:51PM

ఆచార్య కేకే రంగనాథాచార్యుల మరణంపై చంద్రబాబు సంతాపం

అమరావతి: సాహితీ దిగ్గజం కేకే రంగనాథాచార్యులు మరణంపై టీడీపీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. సాహితీ ప్రియులు కేకేఆర్‌గా పిలుచుకునే రంగనాథాచార్యులు సాహితీ విమర్శకులుగా, చరిత్రకారులుగా, ఆచార్యులుగా సాహిత్యానికి, సమాజానికీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన సానుభూతి ప్రకటించారు. కేకే రంగనాథాచార్యులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 


Advertisement