హైదరాబాద్: కొత్త జోనల్ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని సూచించారు. నాలుగు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని వారిని కేసీఆర్ ఆదేశించారు. భార్యభర్తలు ఒకేచోట పనిచేస్తేనే ప్రశాంతంగా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి