హైదరాబాద్: త్వరలోనే దళితబంధు నిధులను విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధుపై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నారు. తెలంగాణలో దళిత సమాజం తలెత్తుకునేలా ఉండాలన్నారు. దళితబంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. హుజురాబాద్‌తో పాటు మరో 4 మండలాలలో దళితబంధును అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి