ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?: కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-11-09T00:24:03+05:30 IST

తాను ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా అని బీజేపీ నాయకులను సీఎం

ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?: కేసీఆర్‌

హైదరాబాద్: తాను ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా అని బీజేపీ నాయకులను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలోని కరవు ప్రాంతాలకు నీళ్లు వచ్చాక మిగతా నీటికి తీసుకెళ్తే తమకు అభ్యంతరం లేదని చెప్పామని కేసీఆర్‌ పేర్కొన్నారు. తాను ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా అని కేసీఆర్‌ నిలదీసారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అందని ఇల్లు లేదన్నారు. గొర్రెల పథకానికి ఎన్‌సీడీసీ బ్యాంక్‌ నుంచి అప్పుతీసుకున్నామన్నారు. బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారుని కేసీఆర్‌ మండిపడ్డారు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్‌ పథకం ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలు ఉన్నాయా అని కేసీఆర్‌ నిలదీసారు. 

Updated Date - 2021-11-09T00:24:03+05:30 IST