Kamareddy: బీడీ వర్కర్స్‌ కాలనీలో ప్రమాదంపై CM KCR విచారం

ABN , First Publish Date - 2022-07-13T00:17:38+05:30 IST

బీడీ వర్కర్స్‌ కాలనీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విచారం వ్యక్తం చేశారు.

Kamareddy: బీడీ వర్కర్స్‌ కాలనీలో ప్రమాదంపై CM KCR విచారం

కామారెడ్డి (Kamareddy): జిల్లాలోని బీడీ వర్కర్స్‌ కాలనీ (Beedi Workers Colony)లో ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో.. అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్‌ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కరెంట్‌ వైర్ తగిలి దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. మృతులు హైమద్(35), పర్వీన్(30), అద్నాన్(4), మాహిమ్(6)గా గుర్తించారు.


కామారెడ్డి జిల్లాలోని బీడీ వర్కర్స్ కాలనీలో విషాదఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-07-13T00:17:38+05:30 IST