రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం లేదు: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-21T23:34:17+05:30 IST

రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా బిజెపి ప్రభుత్వ హయాంలో అమలుకావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం లేదు: కేసీఆర్‌

హైదరాబాద్: రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా బిజెపి ప్రభుత్వ హయాంలో అమలుకావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి పైగా పెంచుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ మేరకే తెలంగాణ పంపిన తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. =ఎస్సీ వర్గీకరణకు కూడా అతీగతీ లేదు.దేశం బాగుపడాలంటే బీజేపీ పోవాలని ఆయన పిలుపునిచ్చారు.


కేవలం ధాన్యంతోనే మా ఉద్యమాన్ని ఆపము. మరిన్నిఆంశాలతో ముందుకు పోతామన్నారు. అనేక అంశాలపై కేంద్రంతో పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి నాయకులు ప్రజలను ఉద్వేగాలకు గురిచేస్తున్నారని అన్నారు.దుర్మార్గపు రాజకీయ క్రీడ దేశంలో కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.

Updated Date - 2022-03-21T23:34:17+05:30 IST