పెద్ద కంపెనీలన్నీ దేశం నుంచి వెళ్లిపోయాయి:Cm Kcr

ABN , First Publish Date - 2022-07-02T21:15:00+05:30 IST

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల పెద్ద కంపెనీలన్నీ కూడా దేశం నుంచి వెళ్లిపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr)అన్నారు.

పెద్ద కంపెనీలన్నీ దేశం నుంచి వెళ్లిపోయాయి:Cm Kcr

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల పెద్ద కంపెనీలన్నీ కూడా దేశం నుంచి వెళ్లిపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr)అన్నారు.మోదీని చూసి పెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయన్నారు. ప్రధానిగా తాను శాశ్వతం అనే భ్రమలో మోదీ(modi) ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం.మోదీ ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా వ్యవహరిస్తున్నారని అభివర్ణించారు. కేంద్ర నిర్ణయాలతో రైతులు, సైనికులు, ఉద్యోగులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.


మోదీ పాలనలో దేశంలో భారీ స్కాంలు జరిగాయని కేసీఆర్ తెలిపారు.బ్లాక్‌ మనీ ఎంత వెనక్కి తీసుకువచ్చారో మోదీ చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్ చేశారు.శ్రీలంక విషయంలో మోదీ స్పందించకపోతే దోషిగా పరిగణిస్తామన్నారు.మీరు దోషి కాదని రేపటి బహిరంగ సభలో వివరణ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.రూపాయి ఎలా పతనమవుతుందో రేపు మోదీ మాట్లాడాలన్నారు.నేపాల్‌, బంగ్లాలో రూపాయి విలువ పడిపోదు కానీ భారత్‌కు ఆ పరిస్థితి ఎందుకు?అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.



Updated Date - 2022-07-02T21:15:00+05:30 IST