తెలంగాణ స్టేట్ జ్యూడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-16T01:23:22+05:30 IST

తెలంగాణరాష్ట్ర న్యాయాధికారుల సదస్సు శుక్రవారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ లోని అన్వయ కన్వెన్షన్ లో ప్రారంభమైంది.

తెలంగాణ స్టేట్ జ్యూడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర న్యాయాధికారుల సదస్సు శుక్రవారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ లోని అన్వయ కన్వెన్షన్ లో ప్రారంభమైంది. తెలంగాణ స్వరాష్ట్రంలో దాదాపు 400 మంది వివిధ విభాగాలకు చెందిన న్యాయాధికారులతో ఈసదస్సు మొదటిసారి జరుగుతోంది. శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రాష్ట్ర న్యాయ వ్యవస్ధను మరింత బలోపేతంచేయడం, కోర్టు భవనాల నిర్మాణం, న్యాయవ్యవస్ధలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకునే దిశగా అప్ డేట్ కావడం, తదితర మౌళిక వసతులను మెరుగు పరచడం, తగినంతగా న్యాయమూర్తులు ,అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించే చర్యలతో పాటు న్యాయ వ్యవస్ధలో పని చేస్తున్న వారి సంఓేమానికి తగిన చర్యలు చేపట్టడం అనే అంశాలపై చర్చించనున్నారు. 


భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు,రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా పురోగమిస్తూ, ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నదని అన్నారు. పటిష్టమైన పద్దతులు ఫిస్కల్, హార్డ్ డిసిప్లిన్ అమలు చేయడం ద్వారా ఈ పురోగతి సాధ్యమైందన్నారు. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిస్ర్రీఆఫ్ ఫైనాన్స్ వెలువరించిన లెక్కల ప్రకారం 2014-15లో 1.24 లఓలున్న రాష్ట్ర తలసరి ఆదాయం 2.78 లఓలకు చేరుకుందన్నారు. విద్యత్ రంగంలో సాధించిన పురోగతితో నాటి బాధలు నేడు లేవని చెప్పారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సమాచార సాంకేతిక రంగాల్లో అద్భుతంగా తెలంగాణ పురోగమిస్తుందన్నారు. పరిపాలనా సంస్కరణలు తీసుకు వచ్చి 33 జిల్లలుగా ఏర్పాటుచేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ డిస్ర్టిక్ట్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకుంటున్నామని సీఎం తెలిపారు. గతంలో కంటే తెలగాణ రాష్ట్ర న్యాయవ్యవస్ధ, న్యాయ పరిపాలనా విభాగం ఇంకా చాలా గొప్పగా ముందుకు పోవాలని అన్నారు. ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయ శాఖగా తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్ద పేరు గడించాలని ప్రబలంగా కోరుకుంటున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-04-16T01:23:22+05:30 IST