Hyderabad: ప్రగతిభవన్‌ ఎదుట కలకలం

ABN , First Publish Date - 2022-08-11T22:11:23+05:30 IST

ప్రగతి భవన్ (Pragati Bhavan) ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. సూర్యాపేట(Suryapet)కు చెందిన యువకుడు రవి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో యువకుడిని ప్రగతి భవన్ సిబ్బంది ...

Hyderabad: ప్రగతిభవన్‌ ఎదుట కలకలం

హైదరాబాద్: ప్రగతి భవన్ (Pragati Bhavan) ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. సూర్యాపేట(Suryapet)కు చెందిన యువకుడు రవి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో యువకుడిని ప్రగతి భవన్ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని పంజాగుట్ట (Panjagutta) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు రవి ఒక్కసారిగా ప్రగత్ భవన్ వద్దకు చేరుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది షాక్ గురయ్యారు. వెంటనే రవిని పట్టుకుని పెట్రోల్ (Petrol) డబ్బాను లాక్కుని సర్ది చెప్పారు. అయినా వినకపోవడంతో రవిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనతో ప్రగతి భవన్ ఎదుట పంజాగుట్ట-సికింద్రాబాద్ (Secunderabad) రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. కొంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రస్తుతం వాహనాలు యధావిధిగా నడుస్తున్నాయి. 


అయితే ప్రగతి భవన్‎లో తెలంగాణ కేబినెట్ భేటీ (Cabinet meet) జరుగుతోంది. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎం కేసీఆర్ (Cm Kcr) కూడా పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక, కొత్త ఆసరా పెన్షన్లు, డయాలసిస్ పేషంట్స్‌కు పెన్షన్ల, ఆగస్ట్ 15న 75 మంది ఖైదీల విడుదల, తదితరల అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమయంలో ప్రగతిభవన్ ఎదుట రవి ఘటన కొంత కలకలం సృష్టించింది. 

Updated Date - 2022-08-11T22:11:23+05:30 IST