Cabinet meeting: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

ABN , First Publish Date - 2022-08-11T19:48:47+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.

Cabinet meeting: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ (Telangana cabinet) భేటీ కానుంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. అలానే 21న ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. కొత్తగా 10లక్షల మందికి ఆసరా పెన్షన్లు, డయాలసిస్ పేషంట్స్‌కు పెన్షన్లపై చర్చించే అవకాశం ఉంది. ఆగస్ట్ 15న 75 మంది ఖైదీల విడుదలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-08-11T19:48:47+05:30 IST