‘ఆత్మబంధువు-దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-10-24T01:53:21+05:30 IST

కవి, రచయిత, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ సంపాదకత్వంలో రూపొందించిన ‘ఆత్మబంధువు-దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు.

‘ఆత్మబంధువు-దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: కవి, రచయిత, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ సంపాదకత్వంలో రూపొందించిన ‘ఆత్మబంధువు-దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. దళిత బంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషి అంతా ఈ పుస్తకంలో రూపొందించినట్టు జూలూరి తెలిపారు. అనంతరం తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గౌరీశంకర్‌ దంపతులు వివాహపత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా మంత్రులు జగదీశ్‌ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T01:53:21+05:30 IST