నారాయణగౌడ్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి

ABN , First Publish Date - 2021-02-25T04:53:37+05:30 IST

పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళులు అర్పించారు.

నారాయణగౌడ్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సానుభూతిని తెలియజేస్తున్న సీఎం కేసీఆర్‌

- రోడ్డు మార్గాన పాలకొండలోని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి

- కుటుంబ సభ్యులకు పరామర్శ 

- మంత్రి తండ్రి మృతికి కారణాలపై ఆరా 


మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 24 : పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళులు అర్పించారు. మమబూబ్‌నగర్‌ మునిసిపాలిటీ పరిధిలోని పాల కొండలోని మంత్రి వ్యవసాయ క్షేత్రం వద్ద నారాయణగౌడ్‌ దశదినకర్మ కా ర్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం హాజరయ్యా రు. రోడ్డు మార్గం ద్వారా సీఎం మధ్యాహ్నం 12:35 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి బస్సులో చేరుకున్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు సంతో ష్‌కుమార్‌ వచ్చారు. మంత్రి బస్సు వద్దకు చేరుకొని సీఎంను రిసీవ్‌ చేసు కున్నారు. ఆయన మంత్రిని దగ్గరికి తీసుకొని తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నారాయణగౌడ్‌ సమాధి వద్దకు చేరుకొని, పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. నారాయణగౌడ్‌ సతీమణి శాంతమ్మను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి తన తండ్రి జ్ఞాపకార్దం ఏర్పాటు చేసిన శాంతా నారాయణగౌడ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కు సంబంధించి న రిజిస్ట్రేషన్‌ ప్రతిని సీఎం చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం భోజనం చేశారు. కొద్ది సేపు వారి తో మాట్లాడారు. తన తండ్రి మరణానికి గల కారణాలను మంత్రిని అడి గి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తూ, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన విష యాన్ని మంత్రి సీఎంకు వివరించారు. వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్‌ 12:35కు వచ్చి, 1:50 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రఽ దాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పి.రాము లు, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గు వ్వల బాలరాజు, అంజయ్యయాదవ్‌, అబ్రహాం, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కాటేపల్లి జనార్ద న్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పీ చైర్‌పర్సన్‌లు స్వర్ణా సుధా కర్‌రెడ్డి, సరితలు నారాయణగౌడ్‌ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.


హెలికాప్టర్‌లో వస్తారనుకున్నా..

సీఎం హెలికాప్టర్‌ ద్వారా పాలమూరుకు వస్తారని, ఈ మేరకు ఎం వీ ఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అయితే, చివరి క్షణంలో ఆయన రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. ఆ యన రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాల పోలీసులు బందోబస్తు పాల్గొన్నారు. శంషాబాద్‌ నుంచి పాలమూరు వరకు ఎక్కడికక్కడ భద్ర తా చర్యలు చేపట్టారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు బందోబస్తును పర్యవేక్షించారు.

Updated Date - 2021-02-25T04:53:37+05:30 IST