Abn logo
May 23 2020 @ 15:53PM

జగన్ దేవాలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టటం అవమానించడమే: పద్మశ్రీ

గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విమర్శలు గుప్పించారు. బైబిల్ పట్టుకుని తిరిగే జగన్ రెడ్డి టీటీడీ మరియు ఇతర హిందూ దేవాలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టటం హిందువులను అవమానించటమే అని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అన్నారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం, మీ బినామీలకు కట్టబెట్టటం కోసం ఇదో కొత్త  ఎత్తుగడ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షకులు అని ప్రచారం చేసుకునే స్వరూపానంద స్వామి , చిన్నజీయర్ స్వామీ ఇతర పీఠాధిపతులు ఏమయ్యారని,? మీరు కూడా ప్రశ్నించటానికి భయపడుతున్నారా? అని పద్మశ్రీ అన్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు మెయింటైన్ చెయ్యలేము అని, దాతలు ఇచ్చిన భూములు,  భక్తులు ఇచ్చిన కానుకులతో కొన్న టీటీడీ ఆస్తులు అమ్మకానికి పెట్టటం చేతకాని తనమని, అంత చేతగాని వారు చైర్మన్  వై .వి. సుబ్బారెడ్డి , పాలక మండలి సభ్యులు రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడేది మేమే అని ప్రగాల్భాలు పలికే భారతీయ జనతా పార్టీ , విశ్వ హిందూపరిషత్ పెద్దలు మొద్దునిద్ర పోతున్నారా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొవాలని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
Advertisement