మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-26T04:55:28+05:30 IST

మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆ

మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యం
మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రి కాకాణి

‘చేయూత’ చెక్కు పంపిణీలో మంత్రి కాకాణి

ముత్తుకూరు, సెప్టెంబరు 25 : మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి  అన్నారు. ఆదివారం స్థానిక మండల కార్యాలయాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ చేయూత పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని మండలానికి చెందిన 3,510 మంది లబ్ధిదారులకు రూ.6.58 కోట్ల మెగా చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఈ మూడు విడతల్లో 3,43,998 మందికి రూ.645కోట్లు,  సర్వేపల్లి నియోజకవర్గంలో 46,265 మంది లబ్ధిదారులకు రూ.86.75కోట్లు అందించామని,  వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారేతర ప్యాకేజీ ఒక్కో కుటుంబానికి రూ.25వేలను అక్టోబరు ఆఖరులోగా ముఖ్యమంత్రి  ద్వారా మీదుగా అందిస్తామన్నారు. నేలటూరు పాలెం వద్ద రూ.50కోట్లతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. అనంతరం దివ్యాంగ బాలిక జాహ్నవికి మంత్రి వీల్‌చైర్‌ను అందించారు. మత్స్యకార క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో విజేతలకు మంత్రి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, వైసీపీ మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి, ఎంపీపీ గండవరపు సుగుణ, జడ్పీటీసీ వెంకటసుబ్బయ్య, వైసీపీ నాయకులు ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, కాకుటూరు లక్ష్మణ్‌రెడ్డి, నెల్లూరు శివప్రసాద్‌, మాచిరెడ్డి శేఖర్‌రెడ్డి, నడవడి ముత్యంగౌడ్‌, ఎంపీడీఓ ప్రత్యూష, తహసీల్దారు మనోహర్‌బాబు, డీఆర్‌డీఏ ఏరియా కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులు, సర్పంచ్‌లు,  ‘చేయూత’ లబ్ధిదారులు పాల్గొన్నారు. 

జట్ల కొండూరులో ‘గడగడపకు’

 మంత్రి కాకాణి

 మనుబోలు, సెప్టెంబరు 25: మండలంలోని జట్లకొండూరు పంచాయతీలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణికి గ్రామ వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ. 3.84కోట్ల అభివృద్ది పనులకు ప్రారంబోత్సవాలు, శంఖుస్థాపనలకు  మంత్రి  ఫైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం సచివాలయం సందర్శించి సిబ్బందితో అభివృద్ది, సంక్షేమ పథకాలపై సమీక్షించారు.  తర్వాత ఇంటింటా తిరిగి కరపత్రాలు అందించి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ,  ఎంపీపీ గుండాల వజ్రమ్మ, సర్పంచు నాగమ్మ, ఉపసర్పంచు ఆవుల తులసీరామ్‌ యాదవ్‌, వైసీపీ నాయకులు వెందోటి భాస్కర్‌రెడ్డి, యరమాపు శంకర్‌రెడ్డి, గుంజి రమేష్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T04:55:28+05:30 IST