Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమె తలమీద చేయిపెట్టి ఒట్టేసిన cm jagan

తిరుపతి: సీఎం జగన్‌ను టీటీడీ కాంట్రాక్ట్ కార్మికురాలు రాధా కలిశారు. చాలీచాలని జీతాలతో కార్మికురాలు రాధా అవస్థలు పడుతున్నామన్నారు. టీటీడీ కార్మికుల సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారు. తలమీద చేయిపెట్టి ఒట్టేయాలని సీఎంను రాధా కోరింది. దీంతో 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తానని తలమీద చేయిపెట్టి జగన్‌ ఒట్టేశారు. నిరసన విరమించాలని కార్మికులను పోలీసులు కోరారు. కార్మికులకు అండగా నిలబడి సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు టీటీడీ ఉద్యోగ సంఘ నేతల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


రాధ, జగన్ వీరాభిమాని. తన చేతిపై జగన్ పచ్చబొట్టు పొడిపించుకుంది. టీటీడీ కార్మికుల సమస్యలపై ఆమె కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంది. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన ఆపేది లేదని, పోలీసులు కొట్టినా.. జైల్లో పెట్టినా భయపడేది లేదని ఆమె స్పష్టం చేసింది. జగనన్నకు ఇది న్యాయం కాదని, ఇప్పటికైన తమ సమస్యలు పరిష్కరించాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు జగన్ ఈ రోజు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement