అమరావతి: నేడు దావోస్‌కు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి వెళ్లనున్నారు. ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొననున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారం కోసం ఈవేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం పై సీఎం జగన్ ప్రసంగం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సదస్సుకు 2200 మంది పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సదస్సులో జగన్ వివరించనున్నారు. సీఎం వెంట దావోస్‌కు మంత్రులు బుగ్గన, అమర్‌నాథ్ వెళ్లనున్నారు.