తేడా చూడండి..

ABN , First Publish Date - 2022-05-17T06:06:43+05:30 IST

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం నాలుగో ఏడాది తొలి విడత నగదు పంపిణీ సభను సీఎం జగన్‌ ఏలూరు జిల్లా గణపవరం మూర్తిరాజు డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ప్రారంభించారు.

తేడా చూడండి..

మూడేళ్ల పాలనపై ప్రజలకు సీఎం జగన్‌ పిలుపు

గణపవరాన్ని పశ్చిమ జిల్లాలో కలుపుతున్నట్టు ప్రకటన

 కొల్లేరు రెగ్యులేటర్‌ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి 

 పలుచోట్ల వంతెనలు, సమ్మర్‌ స్టోరేజీల నిర్మాణానికి హామీ

 గంటన్నర ఆలస్యంగా ముఖ్యమంత్రి ప్రసంగం

 మొదలుకాగానే వెళ్లిపోయిన జనం.. ఖాళీ అయిన కుర్చీలు

 రైతును పిలిచారు.. మహిళా మాజీ సర్పంచ్‌తో మాట్లాడించారు

 షాపులు మూసివేత.. రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు

 మండిన ఎండలు, ఉక్కపోతతో జనం అవస్థలు

 జిల్లావ్యాప్తంగా కమ్యూనిస్టు నేతల గృహ నిర్బంధం


ఏలూరు/గణపవరం/నిడమర్రు, భీమడోలు, మే 16 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం నాలుగో ఏడాది తొలి విడత నగదు పంపిణీ సభను సీఎం జగన్‌ ఏలూరు జిల్లా గణపవరం మూర్తిరాజు డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ప్రారంభించారు. సీఎం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. ఉదయం పదిన్నరకు సీఎం ప్రసంగం ప్రారంభం కావాల్సి ఉండగా గంటన్నర ఆలస్యం గా మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. ఓ వైపు ఎండ వేడి, ఉక్కపోతతో జనం విలవిల్లాడారు. అప్పటికే విసిగిపో యిన వారు కూర్చోలేక సీఎం ప్రసంగం ప్రారంభమైన పది నిమిషాలకే సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి పోవడం మొదలుపెట్టారు. పోలీసులు ఆపుతున్నా పట్టిం చుకోలేదు. పావు గంటకే చాలా కుర్చీలు ఖాళీ అయ్యాయి. 10–20 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించే జగన్‌ దాదాపు 45 నిమిషాలకుపైగా మాట్లాడారు. ప్రజలు తనను నమ్మ డం లేదేమోనన్న భావన ఆయన ప్రసంగంలో తొణికిసలాడింది. గత ప్రభుత్వం పాలన – ప్రస్తుత మూడేళ్ల పాలనలో తేడాలు చూసి మీరే గుర్తించాలంటూ 2004కు ముందు ఉమ్మడి ఏపీలో జరిగిన పొరపా ట్లను ఎత్తి చూపే ప్రయ త్నం చేశారు. రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు, కుటుంబాలతోపాటు ఆత్మహత్య చేసుకున్న కౌలు, రైతులు, రైతు కూలీలకు పూర్తిగా రూ.7 లక్షల నష్ట పరిహారాన్ని ఇచ్చే శామని చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్ర బాబు ఇచ్చిన మాట తప్పా రని, మేనిఫెస్టోను టీడీపీ బుట్టదాఖలు చేసిందని, తాము మాత్రం చేసిన అభివృద్ధితో ప్రజల గుమ్మాల ముందుకు వస్తున్నామని చెప్పారు. కొల్లేరు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్‌లో శంకుస్థాపన చేస్తా మని హామీ ఇచ్చారు. కొల్లేరు ప్రాంతాన్ని భూసర్వే కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని త్వరలో ఆ పనులు అమలు కాబోతున్నాయని తెలిపారు. గణపవరం మండలాన్ని పశ్చి మ గోదావరి జిల్లా భీమవరం డివిజన్‌లో చేరుస్తామని ప్రకటించారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి మాట్లా డుతూ రాష్ట్రంలో జరుగుతున్న పలు అత్యాచారాల్లో నిందితులంతా టీడీపీ నాయకులేనని చెప్పే ప్రయత్నాన్ని భుజాన వేసుకోగా, ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు నియోజ కవర్గ సమస్యలపై సీఎం ముందు ఏకరువు పెట్టారు. 


జగన్‌ చూసినంతగా..

రైతు భరోసా లబ్ధి పొందిన ఒక రైతు తన అనుభవాలను ప్రభుత్వానికి వివరిస్తారని సభ అధ్యక్షుడు ప్రకటించగా, కాసేపటికి సీతామ హాలక్ష్మి అనే ఓ మహిళ వేదికపైకి వచ్చారు. మైకు తీసుకుంది మొదలు జగనన్నా.. జగనన్నా.. అంటూ భజన చేస్తున్నట్లు మాట్లాడారు. తన తల్లిదండ్రులు కన్నారే తప్ప, జగన్‌ అంత గొప్పగా వారు తమను ఎప్పుడూ చూసుకోలేదంటూ చెప్ప డంతో అంతా అవాక్కయ్యారు. రైతు భరోసా, డ్వాక్రా రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పరిహారం తదితర పథకాల ద్వారా తన కుటుంబంతోపాటు తన చిన్న కుమారు డి కుటుంబం లబ్ధి పొందుతుందని సీఎంకు వివరించారు. సున్నా వడ్డీ కింద రూ.18 వేలు, ఇతర పథకాల కింద రూ.లక్షా 80 వేలను పొందామని, తద్వారా తమ కుటుంబం పేదరికం నుంచి అభివృద్ధి వైపు నకు వెళుతున్నామని తెలిపారు. ఈ ఒక్క కుటుంబంలోనే అన్ని పథకాలకు అర్హత సాధించిన ఆ మహిళ ఎవరా అని పలువురు ఆరా తీయగా, ఆమె పిప్పర గ్రామ మాజీ సర్పంచ్‌, వైసీపీ కార్యకర్త అని తెలుసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. 


షాపులు మూసేసి..

గణపవరం జంక్షన్‌తోపాటు నారాయణపురం, భీమవరం, తాడేపల్లిగూడెం వైపు రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యాపార దుకాణాలపై నిషేధాజ్ఞలు విధించి ఉదయం ఆరు గంటలకే వాటిని మూయించారు. భద్రతా కారణాల రీత్యా మూసేయాలని పోలీసులు మైకు ద్వారా ప్రచారం చేశారు. హోటల్స్‌, మందుల షాపు లు, పూలు, పండ్ల దుకాణాలన్నీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ తెరవలేదు. సీఎం కాన్వా య్‌ వెళ్లే రహదారికి ఇరువైపులా ఇనుప బారీకేడ్లు ఏర్పాటు చేయ డంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మందుల షాపులు లేక వృద్ధులు, చంటి పిల్లలకు ఇబ్బందులకు గురయ్యారు. సభ అయిన తర్వాత రోడ్లపైకి వచ్చిన ప్రజలకు కూల్‌డ్రింక్‌ షాపులు కూడా మంచినీళ్లు కూడా దొరకక తీవ్ర అసహనానికి గురయ్యారు. సినిమా హాళ్లలో ఉదయం రెండు షోలను నిలిపివేశారు. వీఐపీ పాస్‌లతో వచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులను పోలీసులు గేటు ముందే నిలిపివేశారు. పాస్‌లున్నా సభలోకి పంపకపోవడంతో వారు వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి ఇందుకూరి కృష్ణంరాజు ను సైతం అనుమతించక పోవడంతో వెనుతిరిగారు. సభలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, కలెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేశ్‌, ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), మేకా ప్రతాప్‌ అప్పారావు తదితరు లతోపాటు ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ధనుంజయరెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ హరికిరణ్‌, జేసీ అరుణ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. 


1,80,305 మందికి లబ్ధి 

గణపవరంలో జరిగిన రైతు భరోసా పంపిణీలో జిల్లాకలెక్టర్‌ వై. ప్రసన్నవెంకటేష్‌ మాట్లాడుతూ రైతు భరోసా రాష్ట్రస్థాయి కార్యక్రమం ఏలూరు జిల్లాలో సీఎం ప్రారంభించడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. ఈ ఏడాది ఏలూరు జిల్లాలో 1,80,305 మంది రైతులకు 5,500 చొప్పున రైతు భరోసా మొదటి వాయిదా సొమ్ము లబ్ధి పొందుతుందన్నారన్నారు. రైతు భరోసా పథకంలో అర్హత పొంది సాంకేతిక కారణాలతో లబ్ధి పొందలేకపోయిన రైతుల వివరాలు తీసుకొని వారికి దగ్గరలోని గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రాల ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకొనే విధంగా చర్యలు తీసు కుంటున్నామన్నారు. 


జగన్‌ బిల్డప్‌ చూసి నవ్వుతున్నారు

 టీడీపీ అధ్యక్షుడు గన్ని

ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా తొలినాడు తోలిన ధాన్యానికి ఇప్పటి వరకు సొమ్ములు వేయలేని సీ ఎం జగన్‌ ప్రజలకు ఏదో చేసినట్లు ప్రస్తుతం ఇస్తున్న బిల్డప్‌ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఎద్దేవా చేశారు. రైతుల దగ్గర కొన్న ధాన్యానికి రూ.43 వేల కోట్లు ఇచ్చి మేలు చేశానని చెప్పుకోవడం జగన్‌కే చెల్లిం దని, రైతులు అమ్మిన ధాన్యానికి వారికి రావాల్సిన డబ్బు లు ఇచ్చారని, దీనిలో సీఎం చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం ఇదే గణపవరం సభలో ఎన్నో వాగ్దానాలు చేశారని, అవి అమలు చేయకుండానే మళ్లీ వాగ్దానాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నార న్నారు. పోవాలి జగన్‌ మాకొద్దు జగన్‌ అనే విధంగా గణపవరం సభ జరిగిందని విమర్శించారు. ఇది గమనించే మహిళలు జగన్‌ ప్రసంగం మొదలవ్వగానే సభ నుంచి వెళ్లిపోయారన్నారు.


తీసుకొచ్చి వదిలేశారు

– వడ్డి సత్యవతి పెదనిండ్రకొలను 

 సీఎం జగన్‌ సభకు వస్తే ఇంటి స్థలం ఇస్తామని చెప్పడంతో వచ్చాం. ఉదయం బయలుదేరే ముందు నాయకులు దగ్గరుండి బస్సు ఎక్కించారు. తీరా వచ్చాక ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎండ వేడిమి తట్టుకోలేకపోయాం. 

 

 తెల్లవారుజామున ఏడు గంటలకు బస్సు ఎక్కించారు. తీరా ఇక్కడకు వచ్చాక తినడానికి తిండిలేదు, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు.  

– మజ్జి సూర్యకాంతం, డ్వాక్రా మహిళ, క్రొవ్విడి


 నా కాలుకు ఆపరేషన్‌ చేయించి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేశా. నాకు ఎలాంటి సొమ్ము మంజూరు కాలే దు. నా సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధులకు విన్నవించా. రెండుసార్లు సీఎంవో ఆఫీసుకు వెళ్లినా సీఎంను కలవనీయలేదు. ఇక్కడైనా  కలిసి నా సమస్యను విన్నవిద్దామనుకున్నా పంపలేదు. 

– వడ్డిగర్ల భాస్కరరావు, ఉండి మండలం కనిగొట్ల








Updated Date - 2022-05-17T06:06:43+05:30 IST