ఇంద్రకీలాద్రికి సీఎం జగన్‌

ABN , First Publish Date - 2020-10-21T23:10:56+05:30 IST

ఇంద్రకీలాద్రికి సీఎం జగన్‌ చేరుకున్నారు. జగన్‌కు ఆలయ చైర్మన్‌, ఈవో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు.

ఇంద్రకీలాద్రికి సీఎం జగన్‌

విజయవాడ: ఇంద్రకీలాద్రికి సీఎం జగన్‌ చేరుకున్నారు. జగన్‌కు ఆలయ చైర్మన్‌, ఈవో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అయితే జగన్ పర్యటనకు ముందు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి కొడాలి నాని, కలెక్టర్‌ను అడిగి జగన్‌ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కొండ చరియలు తొలగించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మీడియా పాయింట్ సమీపంలో రేకుల షెడ్డుపై కొండచరియలు పడ్డాయి. రేకుల షెడ్డు ధ్వంసమైంది. ఈ ప్రమాదంతో ముగ్గురికి గాయాలయ్యాయి. దేవస్థానం ఏఈ చరణ్, అటెండర్ సుధాకర్, కానిస్టేబుల్‌ కిరణ్‌కు గాయాలయ్యాయి. గత రెండు నెలలుగా భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి పర్వతం నానింది. ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో అధికారుల వైఫల్యమయ్యారు. ఒక ఎర్రజెండాను పెట్టి చేతులు  అధికారులు దులుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-10-21T23:10:56+05:30 IST