అమరావతి: కరోనా బారిన పడిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సీఎం వెల్లడించారు. ‘‘చంద్రబాబు గారు త్వరగా కోలుకొని, ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలి’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఆయన కుమారుడు లోకేష్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.