Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాడు–నేడుపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలన్నారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు–నేడు కింద భూమి కొనుగోలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం జగన్ అన్నారు. 

Advertisement
Advertisement