రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులపై సీఎం జగన్‌రెడ్డి సమీక్ష

ABN , First Publish Date - 2021-10-27T23:09:26+05:30 IST

సీఎం జగన్‌తో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు

రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులపై సీఎం జగన్‌రెడ్డి సమీక్ష

అమరావతి: సీఎం జగన్‌తో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులపై సీఎం జగన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐపీబీ ప్రాజెక్టుల ద్వారా 48 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం సూచించారు. విశాఖ, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో ఓబెరాయ్‌ ఆధ్వర్యంలో విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు నిర్మించాలని పేర్కొన్నారు. విశాఖ శిల్పారామంలో హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌‌ను నిర్మిస్తారు. తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్‌మెంట్‌, విశాఖలో టన్నెల్‌ ఆక్వేరియం, స్కైటవర్లను నిర్మించే అంశంపై చర్చ జరిగింది., విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌, పెనుగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రం ఏర్పాటుపై చర్చ జరిగింది. 

Updated Date - 2021-10-27T23:09:26+05:30 IST