భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-07-13T00:07:08+05:30 IST

అమరావతి: ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిపై జగన్‌ ఆరా తీశారు. ‘‘గోదావరికి ముందస్తుగానే

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిపై  జగన్‌ ఆరా తీశారు. ‘‘గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయి.  మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా తొలిసారి  జూలైలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద నీరు వచ్చి చేరింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలి. తగిన చర్యలు తీసుకోవాలి. నిరంతరం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉండాలి. కంట్రోల్‌ రూమ్స్‌ సమర్థవంతంగా పనిచేయాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు. 


బాధితులకు పరిహారం అందించాలి

‘‘అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి. సహాయక శిబిరాల నుంచి వరద బాధితులు ఇళ్లకు వెళ్లేటప్పుడు..వ్యక్తికి రూ.1000, ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలి. అల్లూరి, తూ.గో., ఏలూరు, కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున తక్షణ నిధులు విడుదల చేస్తున్నాం. వరద నష్టం, పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి’’ అని సూచించారు. 

Updated Date - 2022-07-13T00:07:08+05:30 IST