అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వైద్యారోగ్యశాఖలో సిబ్బంది నియామకాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. వెంటనే సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీహెచ్సీల నుంచి వైద్యకళాశాలలు, బోధనాసుపత్రుల వరకు పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీని ప్రారంభించి నవంబర్ 15 నాటికి ముగింపు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. సిబ్బంది నియామకానికి కావలసిన కార్యాచరణకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు.