అమరావతి: విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌రంగంలో పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరాలో సంక్షోభం,.. విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం, తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. డిమాండ్ అంచనా మేరకు కార్యాచరణ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్ యూనిట్లు ఏపీకి దశలవారీగా అందుబాటులోకి వస్తోందని సీఎం జగన్ తెలిపారు. వచ్చే వేసవి నాటికి సమస్యలు లేకుండా చూడాలని సీఎం జగన్ అన్నారు.
ఇవి కూడా చదవండి