డిజిటల్‌ లెర్నింగ్‌‌పై CM JAGAN సమీక్ష

ABN , First Publish Date - 2022-06-29T00:57:11+05:30 IST

అమరావతి: విద్యాశాఖలో నాడు–నేడు , డిజిటల్‌ లెర్నింగ్‌‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరులో 8వ తరగతి

డిజిటల్‌ లెర్నింగ్‌‌పై CM JAGAN సమీక్ష

అమరావతి: విద్యాశాఖలో నాడు–నేడు , డిజిటల్‌ లెర్నింగ్‌‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడం, తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై చర్చ జరిగింది.


‘‘8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఒప్పందం ప్రకారం వాటిల్లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయించండి. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలి. అందుకు తగినట్టు ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోండి. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేయండి. జులై 15 కల్లా ఈ పనులన్ని పూర్తి చేయండి’’ అని  సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-06-29T00:57:11+05:30 IST