విద్యుత్ రంగంపై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-02-19T20:58:27+05:30 IST

విద్యుత్ రంగంపై సంబంధింత అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమావేశంలో డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలపై ప్రధానంగా చర్చించారు.

విద్యుత్ రంగంపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: విద్యుత్ రంగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమావేశంలో డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలపై ప్రధానంగా చర్చించారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు విక్రయించే వారితో ఒప్పందాలు చేసుకోవాలని, దీని వల్ల డిస్కంలపై భారం తగ్గుతుందని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్‌పైనా దృష్టిపెట్టాలని సూచించారు. కాలక్రమంలో ఆ ప్లాంట్‌ను విస్తరించడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అదేవిధంగా హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజెక్టులపైనా దృష్టిపెట్టాలని సూచించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పవర్ సెక్టార్ ఉద్యోగులకు అత్యుత్తమ సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలన్నారు.

Updated Date - 2020-02-19T20:58:27+05:30 IST