17న ఓర్వకల్లుకు CM YS Jagan రాక

ABN , First Publish Date - 2022-05-15T13:52:06+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (CM YS Jagan) ఈ నెల 17న ఓర్వకల్లు

17న ఓర్వకల్లుకు CM YS Jagan రాక

కర్నూలు/ఓర్వకల్లు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (CM YS Jagan) ఈ నెల 17న ఓర్వకల్లు మండలానికి రానున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. మండలంలోని బ్రాహ్మణపల్లె మజరా గ్రామమైన గుమితం తండా గ్రామ సమీపాన గ్రీన్‌కో సంస్థ నిర్మిస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీఎస్‌)ను పరిశీలించనున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి 17న ఉదయం 9.34 గంటలకు సీఎం నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.50 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెలిప్యాడ్‌ ద్వారా 11 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు గుమితం తండాకు చేరుకుంటారు. 


అక్కడి నుంచి 11.30 గంటకు లోకల్‌ లీడర్లతో (Leaders) సమావేశం అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.35 గంటలకు గ్రీన్‌కో ఐఆర్‌ఈపీఎస్‌ వద్దకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు స్టోరేజీ ప్రాజెక్టును పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 12.20 గంటలకు గుమితం తండాకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 12.40 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 12.50 గంటలకు విమానం ద్వారా బయలుదేరి 1.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.45 గంటలకు రోడ్డు మార్గన బయలుదేరి 2.05 గంటలకు సీఎం నివాసానికి (CM Home) చేరుకుంటారు. అలాగే సీఎం పర్యటనలో భాగంగా  కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు (Collector), ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి, ఆయా శాఖ అధికారులు సోలార్‌ ప్రాజెక్టును సందర్శించారు. హెలిప్యాడ్‌ స్థలం, పార్కింగ్‌, నాయకులతో ముఖాముఖి, భారీ గేట్లు, మొదలైన  వాటిపై పరిశీలించారు.

Updated Date - 2022-05-15T13:52:06+05:30 IST