CM Jagan నోట 3 రాజధానుల మాట

ABN , First Publish Date - 2022-08-15T17:09:17+05:30 IST

సీఎం జగన్‌ నోట పరోక్షంగా 3 రాజధానుల మాట రావడం చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ..

CM Jagan నోట 3 రాజధానుల మాట

Amaravathi : సీఎం జగన్‌(CM Jagan) నోట పరోక్షంగా 3 రాజధానుల మాట రావడం చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవ(Indepence Day) వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణ తమ విధానమని వెల్లడించారు. ప్రాంతీయ అసమానతలకు.. అక్కడి వారి ఆకాంక్షలకు ఇదే పునాది అని పేర్కొన్నారు. గతంలో ఎన్నికల హామీలు నెరవేర్చకుండా చేసిన నష్టాన్ని పరిపాలన అంటారా? అని ప్రశ్నించారు. నిజాలు చెప్పే మీడియాపైనా సీఎం జగన్‌ పరోక్ష విమర్శలు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం మీడియా భజన చేస్తుందని... మన రాజ్యాంగ నిర్మాతలు, స్వాతంత్ర్య సమరయోధులు ఊహించలేదని జగన్‌ పేర్కొన్నారు.


75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం నాటికి 18 శాతం సాగు భూమికి నీరందించారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయం ఉందన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో దేశం మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి వేగంగా అడుగులు వేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. ఆహారధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామన్నారు. అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఆర్బీకేలు తీసుకొచ్చామన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా చేశామన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లాల పెంపు అని జగన్ పేర్కొన్నారు.


Updated Date - 2022-08-15T17:09:17+05:30 IST