ఏపీ రాజధానిపై జగన్ ఆలోచన మారిందా?

ABN , First Publish Date - 2021-02-24T01:08:54+05:30 IST

ఏపీ రాజధాని అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. అమరావతి రైతులు 433 రోజులుగా అమరావతి రాజధాని అంశాన్ని లైవ్‌లో ..

ఏపీ రాజధానిపై జగన్ ఆలోచన మారిందా?

అమరావతి: ఏపీ రాజధాని అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. అమరావతి రైతులు 433 రోజులుగా అమరావతి రాజధాని అంశాన్ని లైవ్‌లో ఉంచుతూ వచ్చారు. అయితే అందులో కూడా చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రైతులు, మహిళలు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలు అందరూ ఒక్కటై అమరావతి ఉద్యమాన్ని బతికించుకుంటున్నారు. అసలు అమరావతి రాజధానిగా ఉంటుందా?.. ప్రభుత్వం చంపేస్తుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు మొదలు పెట్టి గ్రాఫిక్స్‌ను పూర్తి చేయకుండా ఆపేశారు. ఆ బ్యాలెన్స్ గ్రాఫిక్స్‌ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 శాతం, అంతకుమించి పూర్తై ఆగిపోయిన నిర్మాణాలను రూ.3 వేల కోట్లతో పూర్తి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రీజయన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఈ పనులు అప్పగిస్తూ ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. 


మరి ఈ నేపథ్యంలో ‘‘అమరావతి రాజధాని విషయంలో జగన్ విధానం ఏంటి?. ఆగిపోయిన భవనాలను పూర్తి చేయాలనే నిర్ణయం వ్యూహాత్మకమా?. రాజధాని తరలింపు విషయంలో జగన్ ఆలోచన మారిందా?. అమరావతి-విశాఖ ఉద్యమాలు ప్రభావాన్ని చూపుతున్నాయా?. కేబినెట్ నిర్ణయాలన్నీ మున్సిపల్ ఎన్నికల కోసమేనా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-02-24T01:08:54+05:30 IST