ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం Jagan

ABN , First Publish Date - 2022-06-07T17:18:07+05:30 IST

జిల్లాలో వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం Jagan

గుంటూరు: వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లను సీఎం పంపిణీ చేశారు. 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది. అలాగే 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని జమ చేశారు. ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్‌ లింకేజ్, హిచ్, డ్రాబార్‌లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. దాదాపు రూ.691 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ జరిగింది. గుంటూరు చుట్టుగుంట కూడలి వద్ద నుంచి ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టారు. 


అరగంట వేచి ఉన్న సీఎం జగన్

కాగా... అంతకుముందు హెలికాఫ్టర్‌లో జిల్లాలోని పోలీస్‌ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం జగన్ అరగంటకు పైగా అక్కడే వేచి ఉన్నారు. చుట్టుగుంట కార్యక్రమంలో ప్రజలు సరిపడ లేకపోవడంతో ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో కలెక్టరేట్‌తో పాటు జిల్లా ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులకు అంతరాయం ఏర్పడింది. దీంతో నిర్వహణ తీరు పట్ల జిల్లా నేతలపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-07T17:18:07+05:30 IST