Jagan comments: విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్

ABN , First Publish Date - 2022-08-11T18:23:25+05:30 IST

విద్యార్ధులకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

Jagan comments: విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్

బాపట్ల: విద్యార్ధులకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) తెలిపారు. గురువారం బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో జగనన్న విద్యా దీవెన (Jagannan vidya deevena) కార్యక్రమంలో సీఎం పాల్గొని... విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన సాయం కింద నగదు జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) కింద సాయం అందజేసినట్లు తెలిపారు. 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు సాయం అందుతుందన్నారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఇచ్చింది రూ.11,7158 కోట్లు అని వెల్లడించారు. చదువు ఒక ఆస్తి.. ఎవరూ కొల్లగొట్టలేనిదని తెలిపారు. కుటుంబంలో ఉన్న అందరు బిడ్డలను చదివిస్తామన్నారు. మన తలరాతలు మారాలి అంటే అందరూ చదువుకోవాలని సూచించారు. మారుతున్న తరంతో పాటు.. మన తలరాతలను కూడా మార్చాలన్నారు. అందుకోసం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడాలంటే.. మార్పులు తప్పనిసరి అని జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-11T18:23:25+05:30 IST